సైరా సినిమాతో మరోసారి తన ఎనర్జీని చూపించిన మెగాస్టార్ చిరంజీవి నెక్ట్ కొరటాల ప్రాజెక్ట్ తో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా సినిమాను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఇకపోతే సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అభిమానుల అంచనాల డోస్ ని పెంచుతోంది.  ఎందుకంటే మెగాస్టార్ తో ఈ సినిమాలో తనయుడు రామ్ చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. 

గతంలో మగధీర - బ్రూస్ లీ సినిమాల్లో మెగాస్టార్ తనయుడి కోసం అతిధి పాత్రలో ఫ్యాన్స్ కి కిక్కిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రామ్ చరణ్ గెస్ట్ రోల్ అని కాకుండా సినిమాలో ఒక కీలక పాత్రలో చాలా సేపు కనిపించనున్నాడట. దర్శకుడు కొరటాల మంచి మెస్సేజ్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక గతంలో జనతా గ్యారేజ్ వంటి సినిమాలో మోహన్ లాల్ - జూనియర్ ఎన్టీఆర్ పాత్రలను చాలా ఎట్రాక్టివ్ గా చూపించిన కొరటాల ఇప్పుడు మళ్ళీ అదే ఫార్మాట్ లో వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ తనయుడితో నటించనున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. అయితే అది కొరటాల ప్రాజెక్ట్ అని ఇంకా ఫిక్స్ కాలేదు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం కొరటాల శివ కొత్త చిత్రంలో మెగా హీరోలు కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.  కొణిదెల ప్రొడక్షన్ - మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.