Asianet News TeluguAsianet News Telugu

#RamCharan:సల్మాన్ ఇటు.. చరణ్ అటు,భలే స్కెచ్


చిరంజీవి కుటుంబానికి ,సల్మాన్ ఖాన్ కు మధ్య చాలా కాలంగా స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్నేహం ఇన్నాళ్లు ఆతిధ్యాల ఇచ్చుకోవటం దాకానే సరిపోయింది. కానీ ఇప్పుడు కెరీర్ పరంగా కూడా ఇప్పుడు ఒకరికొకరు ఉపయోగపడుతున్నారు. 

Ram Charan in Salman Khan KisiKa Bhai Kisi KiJaan  movie
Author
First Published Oct 2, 2022, 4:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ ఫాదర్ మూవీలో బాలీవుడ్‌ కండల వీరుడు అతిథి పాత్రలో మెరవనున్న విషయం తెలిసిందే. మరి ఈ పాత్రతో సల్మాన్‌ ఏ మేర అదరగొడతాడో అని బాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. ఈ సినిమాకు బాలీవుడ్  రిలీజ్ కు సల్మాన్ గెస్ట్ రోల్ బాగా ఉపయోగపడనుంది. ఈ విషయం సల్మాన్ సైతం అర్దం  బాగా చేసుకున్నారు. తన సినిమాలు తెలుగు రిలీజ్ కు ఇప్పుడు రామ్ చరణ్ ని లాక్కొస్తున్నారు. ఈ విషయాన్ని సల్మాన్ స్వయంగా తెలిపారు.  రామ్ చరణ్‌ తండ్రి చిరంజీవి సినిమాలో సల్మాన్‌ గెస్ట్ రోల్‌ చేస్తుంటే, సల్లూ భాయి మూవీలో చెర్రీ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వడం విశేషం. ఇటీవల 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఇది సల్మాన్ సినిమాకు బాగా కలిసొచ్చే అంశం.

 మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా ఈ  సినిమాలో చిన్న కేమియో చేసారు. అది కూడా సల్లూ భాయ్‌ సినిమాలో.  సల్మాన్‌ ఖాన్‌ 'కభీ ఈద్‌ కభీ దివాలీ' చిత్రంలో రామ్‌ చరణ్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తెలుగు స్టార్‌ హీరో వెంకటేశ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ కూడా ఇందులో ఓ అతిథి పాత్రలో నటించటం తో మంచి క్రేజ్ రానుంది.

 కొద్దిరోజులుగా ఈ సినిమాలోని పాట షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో సల్లూ భాయితో కలిసి చెర్రీ స్టెప్పులేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం ధ్రువీకరించింది. ‘ఇదేదో మేం మ్యూచువల్‌గా అనుకున్నది కాదు. అనుకోకుండా ఆ కాంబినేషన్ సెట్ అయ్యింది. సౌత్ హీరోల సినిమాలు బాలీవుడ్‌లో బాగా ఆడుతున్నాయ్. మా సినిమాలు సరిగ్గా ఆడటంలేదు. మేమంతా ఇప్పుడు కలిసిపోయాం. ఇదంతా ఇండియన్ సినిమా..’ అంటూ సల్మాన్ ఖాన్ తనదైన స్టయిల్లో సందడి చేశాడు.

సల్మాన్ ఖాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ దన్ పాయో’ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్రకి తెలుగులో రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్.. చిరంజీవి చిత్రంలో కీ రోల్ పోషిస్తుండంతో రామ్ చరణ్.. సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘కభీ ఈద్ కభీ దివాళీ’ సినిమాలో కెమియో రోల్ చేయడానీకి ఓకే చెప్పినట్టు సమాచారం. కథలో ముఖ్యపాత్రలో రామ్ చరణ్ పాత్ర ఎంట్రీ అదిరిపోయే లెవల్లో ఉంటుందని టాక్.

Follow Us:
Download App:
  • android
  • ios