ఒక హీరోతో అనుకున్న ప్రాజెక్టు మరో హీరో దగ్గరకు వెళ్లటం ఓకే అవటం సినీ పరిశ్రమలో సర్వ సాధారణం. అలాగే రీసెంట్ గా ప్రభాస్ తో అనకుని ఓకే చేయించుకున్న ప్రాజెక్టు ఒకటి రామ్ చరణ్ చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ...రామ్ చరణ్ ఏ దర్శకుడుతో ముందుకు వెళ్లాలనే డైలమోలో ఉన్నారు.

ఆయన ముందు నాలుగైదు ఆప్షన్స్ కనపడుతున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలనే ఫిక్స్ అయ్యారట.  మొదట కొరటాల శివ తనను దర్శకుడు గా పరిచయం చేస్తూ మిర్చి వంటి సూపర్ హిట్ ఇచ్చిన  తొలి హీరో ప్రభాస్ తో సినిమా చేయాలనుకున్నారట.ఆ మేరకు ఓ స్టోరీ లైన్ ని రెడీ చేసి ప్రభాస్ కు చెప్పటం ఓకే చేయటం జరిగిందిట. ప్రభాస్ సైతం లైన్ నచ్చి డవలప్ చేయమన్నారట.

అయితే ఈ లోగా అనుకోని విధంగా నాగ్ అశ్విన్ ప్రాజెక్టు ఓకే చేసి ఎనౌన్సమెంట్ వచ్చేసింది. దాంతో కొరటాల శివ...ఆ సినిమా అయ్యేదాకా వెయిట్ చెయ్యాలంటే కష్టమని భావించి...రామ్ చరణ్ కు ఆ లైన్ చెప్పటం జరిగిందని సమాచారం. వెంటనే ఓకే చెప్పిన రామ్ చరణ్ తన తదుపరి సినిమాగా దాన్ని చేయాలని ఫిక్స్ అయ్యినట్లు సమాచారం.  గతంలోనూ  మిర్చి సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమాని చేయాలనుకున్నాడు కొరటాల .. సినిమా కుడా అన్ని ఒకే అయి సెట్స్ పైకి వెళ్లి ఆగిపోయింది. అయితే ఊహించని విధంగా ఆగిపోయింది. అయితే ఎందుకు ఆగిపోయంది అన్నది ఎవరికీ తెలియదు. కానీ దీనిపైన కొరటాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

కొరటాల శివ చెప్పిన ఓ కథకి ఒకే చెప్పాడు రామ్ చరణ్. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ విషయంలో ఆయనకు కాస్త అసంతృప్తి కలిగిందట. ఆ స్క్రిప్ట్‌ని ఎన్నిసార్లు మార్పులు చేసినా అనుకున్నట్లుగా రాలేదట. దీంతో కొరటాల నేరుగా చరణ్ కి అసలు విషయం చెప్పారట.  దీనిపైన రామ్ చరణ్‌ కూడా మీకు కథపై పూర్తి కాన్ఫిడెంట్ ఎపుడు వస్తే అపుడే సినిమాను మొదలుపెడదామని అన్నారట రామ్ చరణ్ .. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొరటాల ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఎప్పటికైనా రామ్ చరణ్ తో పక్కాగా సినిమా తీసి హిట్టు కొడతానని కొరటాల చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. అతిత్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని విడుదల చేయనున్నారు.