యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. అభిమానులు సెలెబ్రిటీలు ఎన్టీఆర్ కు బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఎలాంటి ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయకపోవడం నిరాశకలిగించే అంశమే. లాక్ డౌన్ కారణంగా అది కుదరలేదని చిత్ర యూనిట్ ఇప్పటికే వివరణ ఇచ్చింది. 

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా.. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. తాజాగా రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. 

ప్రియమైన సోదర ఎన్టీఆర్ నీకు జన్మదిన శుభాకాంక్షలు.. నీకు రిటర్న్ గిఫ్ట్ రుణపడి ఉన్నానని నాకు తెలుసు. త్వరలో అద్భుతమైన గిఫ్ట్ ఇస్తా అని రాంచరణ్ ట్విట్టర్ లో తెలిపాడు. రాంచరణ్ బర్త్ డే కి ఆర్ఆర్ఆర్ టీం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఆ వీడియోకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. 

ఈ సంధర్భంగా రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సెట్స్ లో ఉన్న పిక్ షేర్ చేశాడు. ఈ ఫోటో అభిమానులని విశేషంగా ఆకట్టుకోవడమే కాదు.. ఆసక్తికరంగా కూడా ఉంది. ఈ ఫోటోలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ తెల్లటి దుస్తులలో మెరిసిపోతున్నారు. అది ఏదైనా సాంగ్ షూటింగా లేక సన్నివేశామా అని అభిమానులు ఆలోచనలో పడ్డారు.