మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ చివరగా నటించిన చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి దర్శత్వంలో భారీ అంచనాలతో గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం బిగ్ డిజాస్టర్ గా విమర్శలపాలైనప్పటికీ సగానికిపైగా ఇన్వెస్ట్ మెంట్ ని వసూళ్ల రూపంలో తెచ్చిపెట్టింది. 

రామ్ చరణ్ మాస్ స్టామినాని వసూళ్ళలో కనిపించింది. ఇక బుల్లి తెరపై కూడా వినయ విధేయ రామ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ ఛానల్ లో టెలికాస్ట్ చేయగా ప్రతిసారి అద్భుతమైన టిఆర్పి రేటింగ్స్ రాబడుతోంది. 

అందరిని ఆశ్చర్యపరిచే విధంగా తాజాగా ఈ చిత్రం మరోసారి అద్భుతమైన టిఆర్పి రేటింగ్ సాధించింది. ఇప్పటికి 8 సార్లు ఈ చిత్రాన్ని బుల్లితెరపై టెలికాస్ట్ చేయగా ఎప్పుడూ 5 రేటింగ్ తగ్గలేదు. తొలిసారి ఈ చిత్రం 7.9 రేటింగ్ సాధించింది. 8 వ సారి ఈ చిత్రం తొలిసారి కంటే ఎక్కువగా 7.97 రేటింగ్ సాధించింది. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం రాంచరణ్ రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ చిత్రం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో ఆర్ఆర్ ఆర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.