సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరక్కుతున్న దబాంగ్ 3పై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనితో దేశవ్యాప్తంగా ప్రచార కారక్రమాలని చిత్ర యూనిట్ నిర్వహించబోతోంది. ఇందులో భాగంగా దబాంగ్ డాన్స్ టూర్ పేరుతో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నవంబర్ 2న ఓ భారీ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. 

సల్మాన్ ఖాన్ కు నార్త్ లో విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ హైదరాబాద్ లో నిర్వహించే ఈవెంట్ ఆకర్షణగా నిలవాలంటే ఎవరో ఒక తెలుగుస్టార్ అతిథిగా హాజరు కావాల్సిందే. దీనితో సల్మాన్ ఖాన్ ఇద్దరు క్రేజీ హీరోలని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లని సల్మాన్ ఖాన్ ఈ ఈవెంట్ కు ఆహ్వానించాడట. ఈ ఇద్దరి హీరోలతో సల్మాన్ ఖాన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. సల్మాన్ ఖాన్ నటించిన కొన్ని చిత్రాలకు చరణ్ తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పాడు. ఈ ముగ్గురు సూపర్ స్టార్స్ ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల సంతోషానికి అవధులు ఉండవు. 

కానీ చరణ్, ఎన్టీఆర్ ఈ ఈవెంట్ లో పాల్గొంటారా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో 2010లో విడుదలైన దబాంగ్ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దబాంగ్ 2కి సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ దర్శకత్వం వచించాడు. ఆ చిత్రం కూడా హిట్ అయింది. ఈ సిరీస్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ దబాంగ్ 3 ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కించారు.