మాస్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గోపీచంద్. కాకపోతే ప్రస్తుతం గోపీచంద్ ని వరుస పరాజయాలు వేధిస్తున్నాయి. సరైన హిట్ కోసం గోపీచంద్ ప్రయత్నిస్తున్నాడు. గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శత్వంలో సీటీ మార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

క్రీడా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గోపీచంద్ తదుపరి చిత్రం కూడా ఖరారైంది. కెరీర్ ఆరంభంలో తనని విలన్ గా ప్రజెంట్ చేసిన తేజ దర్శత్వంలో గోపీచంద్ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని అలివేలు వెంకటరమణ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

నాజూకైన అందంతో ఆర్జీవీ హీరోయిన్.. బ్యూటిఫుల్ అండ్ సెక్సీ

ఈ చిత్రంలో గోపీచంద్ కి జోడిగా అనుష్క, కాజల్ లాంటి హీరోయిన్లని పరిశీలించారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తోంది. రకుల్ నే హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్. రకుల్, గోపీచంద్ లది సూపర్ హిట్ జోడి. వీరిద్దరూ కలసి నటించిన లౌక్యం చిత్రం గతంలో మంచి విజయం సాధించింది. 

అయితే తేజ రానాతో కూడా ఓ చిత్రం చేయాల్సి ఉంది. ముందుగా గోపీచంద్ చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడా  లేక రానా చిత్రమా అనేది వేచి చూడాలి.