చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్. టాలీవుడ్‌ లో స్టార్ హీరోలతో పాటు నాగార్జున లాంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించిన ఈ భామ ప్రస్తుతం కాస్త స్లో అయ్యింది. బాలీవుడ్ మీద ఆశలతో ఉత్తరాది మీద దృష్టి పెట్టిన ఈ భామకు సౌత్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలు లేకపోయినా స్టార్ హీరో రానాతో ఎఫైర్ అంటూ ఇటీవల రకుల్ పేరు వార్తల్లో వినిపిస్తోంది.

అయితే ఈ వార్తలపై ఇటీవల క్లారిటీ ఇచ్చింది రకుల్. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అన్న రకుల్ తన జీవితంలో ఇంత వరకు ఎలాంటి లవ్‌ ట్రాక్‌ లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే తను ఇప్పటి వరకు సింగిల్‌ గా ఉండటానికి కారణం తన తమ్ముడు అమన్ ప్రీత్ సింగే అంటుంది రకుల్‌. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అక్కా తమ్ముళ్లిద్దరూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన తమ్ముడి కారణంగా తన జీవితంలో అన్ని కోల్పాయానని చెప్పింది రకుల్. చిన్న తనంలో తాను అబ్బాయిలతో స్నేహం చేస్తే తన తమ్ముడు వెంటనే ఇంట్లో చెప్పేసేవాడట. ఒకసారి ఓ అబ్బాయి పక్కన ఊరికే నిలుచుంటే .. రకుల్ ఆ అబ్బాయికి అన్నం తినిపిస్తుందని ఇంట్లో చెప్పాడట అమన్‌, దీంతో ఇక అబ్బాయిలతో మాట్లాడటమే మానేశానని చెప్పింది రకుల్. అయితే ఈ విషయంపై స్పందించిన అమన్‌, అప్పట్లో నేను అలా చేసి ఉండాల్సి కాదు అని చెప్పాడు.

ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోయినా.. మూడు హిందీ, రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ. ఇక అమన్‌ కూడా త్వరలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అమన్‌ హీరోగా తెరకెక్కబోయే సినిమా పనులు కూడా ప్రారంభమయ్యాయి.