టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామర్ తో యువతని ఆకర్షించింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో హిట్ అందుకున్న రకుల్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ స్టార్స్ సరసన ఆడిపాడింది. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర విషయాన్ని తెలియజేసింది. 

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ అంటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ దేశ వ్యాప్తంగా ఉన్నారు. అదే విధంగా ప్రభాస్ సరసన నటించాలని బాలీవుడ్ నటీమణులు సైతం ఆసక్తి చూపుతున్నారు. 

కానీ రకుల్ మాత్రం ప్రభాస్ సరసన నటించేందుకు నో చెప్పిందట. ప్రభాస్ సరసన నటించే అవకాశం తన కెరీర్ ఆరంభంలోనే వచ్చిందని రకుల్ తెలిపింది. మోడలింగ్ లో ఉన్న సమయంలో మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం నన్ను సంప్రదించారు. కానీ ఆ సమయంలో నాకు సినిమాల గురించి అవగాహన లేదు. 

మోడలింగ్ లోనే రాణించాలని అనుకునేదాన్ని. అప్పట్లో సినిమాల పట్ల ఆసక్తి లేక ప్రభాస్ చిత్రానికి నో చెప్పానని రకుల్ అంటోంది. కొంతకాలానికి వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయం సాధించడం.. రకుల్ గ్లామర్ కు అంతా ఆకర్షితులు కావడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. 

రకుల్ ప్రీత్ సింగ్ రాంచరణ్, ఎన్టీఆర్, బన్నీ, మహేష్ , రవితేజ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.