సినిమా ఇండస్ట్రీలో పార్టీలు అనేవి చాలా కామన్. వీటి ద్వారానే ఒకరితో మరొకరికి పరిచయాలు ఏర్పడడం వంటివి జరుగుతుంటాయి. అందుకే తరచూ ఇండస్ట్రీలో ఏదొక పార్టీ జరుగుతూనే ఉంటుంది. గత కొన్నేళ్లలో టాలీవుడ్ లో ఈ పార్టీ కల్చర్ మరింత ఎక్కువైంది.

సెలబ్రిటీల నైట్ లైఫ్, వారు చేసుకునే పార్టీల గురించి సినీ సర్కిల్స్ కూడా చర్చలు జరుగుతుంటాయి. అలాంటి పార్టీలకు జాయింట్ గా హాజరయ్యేవారంతా కూడా సన్నిహితంగా  ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే.. కొంతమంది ఈ పార్టీలకు హాజరవడం ద్వారా వారి జీవితాలే మారిపోతాయని అనుకుంటూ ఉంటారు.

టాలీవుడ్ బెస్ట్ కాంబినేషన్స్.. వీళ్లు కలిస్తే బాక్స్ ఆఫీస్ బద్దలే..!

 పార్టీలకు హాజరయ్యే వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయనే విశ్లేషణలు ఉన్నాయి. పార్టీలకు హాజరయితే నలుగురు దృష్టిలో పడడం, తద్వారా పరిచయాలు ఏర్పడడం.. దీంతో అవకాశాలు వస్తాయనేది ఒక థియరీ. అలానే పార్టీలను మరోరకంగా చూసేవాళ్లు కూడా ఉంటారు. పార్టీలకు బాగా హాజరయ్యే హీరోయిన్లకు ఎక్కువ సినిమా ఛాన్స్ లు వస్తాయనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

ఇది ఎనభైల నుండి జరుగుతున్నదే.. అయితే అలాంటిదేమీ లేదని అంటోంది టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. పార్టీలకు హారజైనంత మాత్రానా హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు దక్కుతాయనేది కేవలం అపోహ మాత్రమేనని అంటోంది రకుల్.

ఈమె మాటలు విన్నవాళ్లు.. బాలీవుడ్ పార్టీలకు హాజరవుతూ ఉండే ఈ బ్యూటీకి పార్టీలతో అవకాశాలు రావని అనుభవంతో చెబుతున్నట్లు ఉందని అంటున్నారు. ప్రస్తుతం రకుల్ తెలుగులో నితిన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అలానే తమిళంలో 'ఇండియన్ 2' సినిమాలో నటిస్తోంది.