టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే బాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ ఏడాది రకుల్ బాలీవుడ్ లో నటించిన దే దే ప్యార్ దే చిత్రం మంచి విజయం సాధించడంతో రకుల్ కు నార్త్ లో మంచి గుర్తింపు లభించింది. 

కానీ టాలీవుడ్ లో మాత్రం ఇటీవల రకుల్ కు కలసి రావడం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో రీసెంట్ గా నటించిన మన్మథుడు 2, దేవ్, ఎన్ జి కె చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ క్రేజీ టాలీవుడ్ హీరోతో ఘాటు ప్రేమ వ్యవహారం నడిపిస్తోందని వార్తలు వినిపించాయి. 

దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ సమాధానం ఇచ్చింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం నేనెవరితోనూ డేటింగ్ చేయడం లేదు. రానా నాకు క్లోజ్ ఫ్రెండ్. మంచు లక్ష్మి కూడా నాకు స్నేహితురాలు. నేను, రానా, మంచు లక్ష్మి మేమంతా ఓ గ్యాంగ్. మా గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. నా ఇల్లు, రానా ఇల్లు పక్క పక్కనే అని రకుల్ తెలిపింది. 

ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను. ప్రేమించేంత తీరిక లేదు. ఇటీవల కాలంలో ప్రేమకు అర్థం మారిపోయింది. ప్రేమ విషయంలో ఇప్పటి తరంలా నేను ఆలోచించలేను. బహుశా నేను 70వ దశకంలో పుట్టి ఉండాల్సింది అని రకుల్ తెలిపింది.