ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మధ్యన రాకేష్ మాస్టర్, శ్రీరెడ్డి మధ్య పెద్ద వారే జరిగింది. రాకేష్ మాస్టర్ శ్రీరెడ్డిని విమర్శించడం, శ్రీరెడ్డి రాకేష్ మాస్టర్ పై బూతులతో విరుచుకుపడడం చూశాం. 

తాజాగా రాకేష్ మాస్టర్ కరోనా విపత్తుని ఎదుర్కొనడానికి సినీ ప్రముఖులు నిజంగానే విరాళాలు ఇస్తున్నారా లేక  ఇచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారా అని ప్రశ్నించారు. సినిమా సెలెబ్రిటీల ఆలోచనా విధానంపై కూడా రాకేష్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ప్రభాస్ కరోనా ఎదుర్కొనడానికి 4 కోట్ల విరాళం ఇచ్చాడు. మనం ఎంత ఇవ్వాలి.. ప్రభాస్ కు ఇండియా మొత్తం క్రేజ్ ఉంది కాబట్టి అంత ఇచ్చాడు.. మనం అంత ఇవ్వాల్సిన అవసరం లేదులే అని ఇతర హీరోలు భావిస్తున్నట్లు రాకేష్ మాస్టర్ పేర్కొన్నారు. 

ఇలాగే అందరిని మించిపోవాలి.. అకిరాకు చిరంజీవి బర్త్ డే విషెష్

ఇక వైసిపి ఎమ్మెల్యే రోజాపై రాకేష్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రజలని గాలికొదిలేసి వంటలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేగా ప్రజలకు తల్లి స్థానంలో ఉంది వాళ్ళ బాగోగులు చూసుకోవాలని రాకేష్ మాస్టర్ రోజాకు సూచించారు. 

ఇక రవితేజ లాంటి హీరోలు తాము ప్రకటించిన విరాళాలపై క్లారిటీ ఇవ్వాలని రాకేష్ మాస్టర్ కోరారు. రవితేజ 20 లక్షలు కరోనాని ఎదుర్కొనడానికి విరాళం ప్రకటించారు. ఆ ఆయన విరాళం ఎవరికి ఇచ్చారు.. ఎప్పుడు ఇచ్చారో కూడా తెలియచేయాలని రాకేష్ మాస్టర్ కోరారు.