ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది 3 చిత్రం తాజాగా సెన్సార్ కార్యకమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'యుఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. హర్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న చిత్రం కాడంతో సినిమా నిడివి తక్కువగానే ఉంది. రాజుగారి గది 3 రన్ టైం కేవలం 2 గంటలు మాత్రమే. 

ఓంకార్ సోదరుడు అశ్విన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. అవికా గోర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో అవికా గోర్ హర్రర్ లుక్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. 

రాజుగారి గది చిత్రానికి సెన్సార్ సభ్యుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో సినిమాలో కామెడీ కూడా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలిచే అవకాశం ఉండదట. 

ఈ సిరీస్ లో మొదటగా వచ్చిన రాజుగారి గది చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన రాజుగారి గది 2 పర్వాలేదనిపించింది. రాజుగారి గది 2లో నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో నటించారు. రాజుగారి గది 3ని అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.