రాజుగారి గది సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకడు ఓంకార్ ఆ తరువాత క్యాస్టింగ్ బలంతో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించి పరవాలేధనిపించాడు. నాగార్జున - సమంత వంటి స్టార్స్ ఆ సినిమాలో కీలకపాత్రలో కనిపించడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ అందాయి కానీ కమర్షియల్ గా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

దీంతో ఇప్పుడు రాజు గారి గది 3 అంటూ మినీ క్యాస్ట్ తో వచ్చిన ఓంకార్ తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్నాడు.  అవికా గోర్ - అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాజుగారి గది 3 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి ట్రైలర్ తో టీజర్స్ తో ఓంకార్ పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయాడు. ఇక రిలీజ్ అనంతరం ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుతోంది,

మొత్తానికి మొదటిరోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్స్ 1.25కోట్లు.  సినిమాకు బజ్ లేకపోవడంతో యూఎస్ లో ప్రీమియర్స్ కి అవకాశం దక్కలేదు. దీంతో లోకల్ గానే కలెక్షన్స్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇక నైజంలో సినిమాకు మంచి కలెక్షన్స్ దక్కుతున్నాయి. ఏరియాల వారీగా మొదటి రోజు సినిమా అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం..................42 లక్షలు

సీడెడ్.................. 24 లక్షలు

వైజాగ్..................16 లక్షలు

గుంటూరు............14 లక్షలు

ఈస్ట్.....................10 లక్షలు

వెస్ట్...................... 6 లక్షలు

కృష్ణ......................9 లక్షలు

నెల్లూరు................4 లక్షలు

మొత్తం ఏపి/తెలంగాణలో  మొదటి రోజు షేర్స్.. రూ .1.25కోట్లు

ప్రస్తుతానికైతే సినిమా కలెక్షన్స్ డీసెంట్ గా ఉన్నాయి. కానీ లాభాలు దక్కాలంటే ఈ రేంజ్ కలెక్షన్స్ సరిపోదు. శనివారం ఆదివారం గట్టిగా లాగితే ప్రాఫిట్స్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సొమవారం నుంచి రెగ్యులర్ గా కలశాలలు స్కూల్స్ మొదలుకానున్నాయి. వీకెండ్ లోనే ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయగలిగితే సినిమా మంచి వసూళ్లను అందుకుంటుంది. ఇంకాస్త ప్రమోషన్స్ డోస్ కూడా పెంచితే బెటర్..