యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఓంకార్ ఆ తరువాత ఓక్ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి రియాలిటీ షోలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత సినిమాలు 
నిర్మించి నిర్మాతగా ఎదిగాడు. తాను నిర్మించే సినిమాలకు డైరెక్టర్ కూడా అతడే.. 'రాజు గారి గది' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటాడు ఓంకారు. దీనికి సీక్వెల్ కూడా వచ్చింది. ఈ సినిమాలతో తన తమ్ముడు అశ్విన్ ని హీరోగా ప్రమోట్ చేస్తున్నాడు.

ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో కొత్తగా 'రాజు గారి గది-3' సినిమా తెరకెక్కించాడు ఓంకార్. ఇప్పటికే ఈ సినిమా  ఫస్ట్‌లుక్, ట్రైలర్ లలో దెయ్యంగా కనిపించి భయపెట్టింది అవికా. ఒక అమ్మాయిని చంపి ఒక బంగ్లాలో పూడ్చిపెట్టడం, దాంతో ఆమె ప్రేతాత్మ దెయ్యంగా మారి భయపెట్టడం వంటి ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

చిత్రబృందం రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందిన ఈ సినిమాను అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేస్తున్నారు.దీనికి సంబంధించిన పోస్టర్ ని దసరా కానుకగా విడుదల చేశారు.  ష‌బీర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందించారు. 

న‌టీన‌టులు:
అవికాగోర్‌
అశ్విన్ బాబు
అలీ
బ్ర‌హ్మాజీ
ప్ర‌భాస్ శ్రీను
హ‌రితేజ‌
అజ‌య్ ఘోష్‌
ఊర్వ‌శి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: ఓంకార్‌
బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: క‌ల్యాణి చ‌క్ర‌వ‌ర్తి
సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు
ఎడిట‌ర్‌: గౌతంరాజు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సాహి సురేశ్‌
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
పాటలు: శ‌్రీమ‌ణి
ఆడియోగ్ర‌ఫీ: రాధాకృష్ణ‌
స్టంట్స్‌: వెంక‌ట్‌