రాజుగారి గది 3 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి పార్ట్ తో సక్సెస్ అందుకున్న దర్శకడు ఓంకార్ ఆ తరువాత క్యాస్టింగ్ బలంతో రాజుగారి గది 2 సినిమాను తెరకెక్కించి పరవాలేధనిపించాడు. నాగార్జున - సమంత వంటి నటీనటుల బలంతో ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ అందాయి టోటల్ గా మాత్రం అనుకున్నంతగా లాభాలు దక్కలేదు.   ఇప్పుడు రాజు గారి గది 3 అంటూ మినీ క్యాస్ట్ తో వచ్చిన ఓంకార్ తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్నాడు.

ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ డే పరవాలేధనిపించే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. ఆదివారం కూడా కలెక్షన్స్ స్టడీగానే కనిపించాయి. కానీ సినిమాకు లాభాలు దక్కాలంటే ఈ రేంజ్ లో సరిపోవని మొదటి నుంచి టాక్ వస్తోంది.  

అవికా గోర్ - అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాజుగారి గది 3 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి ట్రైలర్ తో టీజర్స్ తో ఓంకార్ పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయాడు. ఇక రిలీజ్ అనంతరం ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుతోంది,. మొత్తానికి మొదటిరోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్స్ 1.25కోట్లు.

ఫస్ట్ వీకెండ్ లో రోటర్ షేర్స్ 3.5కోట్లు. సినిమాకు బజ్ లేకపోవడంతో యూఎస్ లో ప్రీమియర్స్ కి అవకాశం దక్కలేదు. దీంతో లోకల్ గానే కలెక్షన్స్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇక నైజంలో సినిమాకు మంచి కలెక్షన్స్ దక్కుతున్నాయి. ప్రస్తుతానికైతే సినిమా కలెక్షన్స్ డీసెంట్ గా ఉన్నాయి. కానీ లాభాలు దక్కాలంటే ఈ రేంజ్ కలెక్షన్స్ సరిపోదు. శనివారం ఆదివారం లాగే మిగతా రోజుల్లో కూడా కలెక్షన్స్ రాబట్టగలిగితే ప్రాఫిట్స్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది.