సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన ప్రత్యేకత చేరుకున్నారు. సూపర్ స్టార్ గా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన రజని ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో పేట చిత్రంతో ఫ్యాన్స్ అని అలరించింది రజని.. సంక్రాంతికి దర్బార్ చిత్రంతో సందడి చేయబోతున్నారు. 

రజనీకాంత్ అందరి హీరోల కంటే భిన్నం. అందుకే దేశం మొత్తం సూపర్ స్టార్ గా కీర్తించబడుతున్నారు. ఎంత క్రేజ్ ఉన్నా, ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ రజని సింపుల్ గా ఉంటారు. సాధారణంగా స్టార్ హీరోలు మరో హీరో గురించి ప్రస్తావించడానికి కూడా ఇష్టపడరు. 

ఒక స్టార్ హీరో, మరో స్టార్ హీరోని అభినందించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక వేరే హీరోల సినిమాల గురించి కూడా కొందరు హీరోలు పట్టించుకోరు. అలాంటిది సూపర్ స్టార్ రజని కుటుంబ సమేతంగా ఇళయదళపతి విజయ్ నటించిన బిగిల్ చిత్రాన్ని థియేటర్ కు వెళ్లి మరీ చూశారు. 

ఆ దృశ్యాలు ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ థియేటర్ లో ఉండగా ఫ్యాన్స్ ఆయన కోసం ఎగబడుతున్నారు. ఇళయదళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కిన బిగిల్ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో అట్లీ ఈ చిత్రాన్ని ఎమోషనల్ గా తెరక్కించారు. ప్రస్తుతం బిగిల్ మూవీ కళ్ళు చెదిరే వసూళ్లతో దూసుకుపోతోంది.