సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దర్బార్‌'. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది.

చాలా కాలం తరువాత ఈ సినిమాలో రజినీ పోలీస్ గెటప్ లో కనిపిస్తుండడంతో థియేటర్ లో ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు. గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఫ్యాన్స్ తో పాటు రజినీకాంత్ కూతుర్లు కూడా హడావిడి చేస్తున్నారు.

'దర్బార్' టీషర్ట్స్ వేసుకొని థియేటర్ కి వెళ్లి రచ్చ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలానే ఈ సినిమా థియేటర్ల వద్ద అభిమానుల హంగామా మాములుగా లేదు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

We live you ....love you Appa ! #sistersquad #darbar

A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush) on Jan 8, 2020 at 7:40pm PST