ప్రస్తుతం కరోనా భయంతో ప్రజలు సొంత వాళ్లను తాకాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. చాలా మంది తమ ఇంట్లో పనిచేసేవారిని కూడా పనులు  మాన్పించేస్తున్నారు. ఒక మనిషి మరో మనిషిని కలిసే పరిస్థితి కూడా లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా రజనీకాంత్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. తన వంతుగా కరోనా పై పోరాటం విషయంలో కృషి చేస్తూ ప్రజల్లో అవేర్‌నెస్‌ కలిగిస్తున్న రజనీ, తన పర్సనల్‌ స్టాఫ్ విషయంలో కూడా పెద్ద మనసు చాటుకున్నాడు.

తాజాగా తన ఇంట్లో పనిచేసే మహిళతో రజనీ దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్‌ స్టార్ అంతటి వాడు తనతో ఫోటో దిగటంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఈ ఫోటో ఏ సందర్భంలో దిగినది అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న రజనీ ఇటీవల ఫ్యామిలీ షార్ట్ ఫిలిం లో నటించాడు. మోదీ పిలుపు మేరకు సంఘీభావంగా చప్పట్లు కొట్టి, దీపాలు వెలిగించి తన అభిమానులకు ఆదర్శంగా నిలిచాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్బార్‌ సినిమాతో మరో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రజనీకాంత్, ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ డ్రామాలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.