తమిళనాట  డెంగీ జ్వరాలు ప్రజలను భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధితో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ సిట్యువేషన్ లో నటుడు రజనీకాంత్‌ డెంగీ బారి నుంచి ప్రజలను రక్షించడానికి నేలవేమ కషాయాన్ని ఉచితంగా అందించాలని తన  ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు.  

మరో ప్రక్క గతంలో డెంగీ జ్వర పీడితులు నేలవేము కషాయం తాగితే వికటించి లేనిపోని చిక్కులొస్తాయని కమల్‌ ట్వీట్‌ చేసిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది.ఈ విషయమై అప్పట్లో వివాదం చెలరేగింది. నేలవేము కషాయం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనల ద్వారా రుజువైందని, డెంగీ నిరోధానికి ఈ కషాయం చాలా మంచిదంటూ ఓ పిటీషన్ కోర్టులో వేసారు. ఆ కషాయాన్ని తాను పలుమార్లు తీసుకున్నానని, ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రాలేదని, వాస్తవాలు ఇలా ఉన్నప్పుడు కమల్‌ ఈ కషాయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పంపిణీ చేయొద్దని అభిమానులకు ఎలా విజ్ఞప్తి చేస్తారని పిటిషన్‌లో ప్రశ్నించారు.  

ఇక మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న దర్బార్‌ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన రజనీకాంత్‌ ఈ నెల 13న   హిమాలయలకు వెళ్లారు. అక్కడ ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని  ముగించుకుని శనివారం చెన్నైకి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చెన్నై విమానాశ్రయంలో వీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. అలాగే తన ఆధ్యాత్మక పయనం విజయవంతంగా ముగిసిందని తెలిపారు. తన తాజా చిత్రం దర్బార్‌ చాలా బాగా వచ్చిందని తెలిపారు.