ఒకే ఒక్క సినిమాతో సౌత్ జనాలని ఆకర్షించిన లోకేష్ కనగరాజన్ ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. కార్తీ తో ఖైదీ అనే సినిమా చేసిన లోకేష్ కనగరాజన్ కి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ దక్కుతున్నాయి. అతని దగ్గర మంచి మంచి కథలున్నాయని తెలుసుకుంటున్న హీరోలు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. ఇలయథలపతి విజయ్ ఖైదీ సినిమా చూసిన వెంటనే లోకేష్ ని పిలిచి కథ ఉంటే చెప్పమన్నాడు.

రెండు రోజులొనె వారిద్దరి మధ్య జరిగిన డిస్కర్షన్స్ కొత్త ప్రాజెక్ట్ కి దారి తీసింది. మాస్టర్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయ్. సినిమా కూడా అద్భుతంగా తెరకెక్కుతోందని కోలీవుడ్ లో ఇప్పటికే పాజిటివ్ టాక్ వైరల్ అయ్యింది. లోకేష్ తప్పకుండా మరొక బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోబోతున్నాడు అని టాక్ వస్తోంది. అయితే ఈ సినిమా టాక్ రజినీకాంత్ చెవిన పడటంతో లోకేష్ ని స్పెషల్ గా కలుసుకున్నారు. వెంటనే తనకు కూడా ఒక కథను సెట్ చేయాలనీ రజినీకాంత్ అడిగినట్లు తెలుస్తోంది.

అందుకు ఎగిరిగంతేసిన లోకేష్ మాస్టర్ అనంతరం తప్పకుండా మీతో సినిమా చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇకపోతే ప్రస్తుతం రజినీకాంత్ శివ దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్టైనర్ కథలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దర్బార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తలైవా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్న రజినీకాంత్ 2020లో మినిమమ్ మూడు సినిమాలను పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడు. మరీ ఆయన ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.