సూపర్ స్టార్ రజనీ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రంలో నటిస్తున్నాడు. రజనీ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయింది. దీనితో విరామం దొరకడంతో రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లారు. 

అక్కడ రజనీకాంత్ వివిధ ప్రాంతాల్లో సామాన్యుడిలా పర్యటిస్తున్నారు. డెహ్రాడూన్ లో రజనితో ఆలయాన్ని సందర్శించారు. ఆలిండియా సూపర్ స్టార్ అయినప్పటికీ సామాన్యుడిలా జనంలో కలసిపోయి గుడికి వెళ్లారు. 

దారిలో కనిపించిన ప్రజలని రజని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఓపికగా వారితో ఫోటోలు దిగుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రిషికేష్ లో మరికొన్ని ఆలయాలని రజని సందర్శించారు.