కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి నెక్స్ట్ రాబోతున్న చిత్రం దర్బార్. దేశం మెచ్చిన దర్శకుడు ఏఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సిద్ధమవుతోంది. జనవరి 9న దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తలైవా తెలుగులో సక్సెస్ అందుకొని చాలా కాలమవుతోంది.

బికినిలో సీరియల్ (నాగిని) బ్యూటీ హాట్ అందాలు

అయితే ఈ సారి స్ట్రాంగ్ గా సక్సెస్ అందుకునేలా కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ స్టైల్ తో దర్శనమిస్తున్నాడు. ఇక సాంగ్స్ తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రజనీ ఇంట్రడక్షన్ సాంగ్ 'దుమ్ము ధూళి' విడుదలైంది. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకువెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఆ పాటను అనంత శ్రీరామ్ రాయగా... ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. సినిమాలో మరో పాట, పెళ్లి నేపథ్యంలో వచ్చే ఎనర్జిటిక్ సాంగ్ 'డుమ్ డుమ్'ను కృష్ణకాంత్ రాశారు.

ఈరోజు ఆ పాటను విడుదల చేశారు. విడుదలైన కొన్ని క్షణాల లో ఈ పాట వైరల్ అవుతోంది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్‌ దర్బార్ సినిమాని నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. తెలుగులో చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేస్తున్నారు.