సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ప్రస్తుతం క్రేజ్ బాగా తగ్గిపోయింది. వరుసగా ఫ్లాప్ లు రావడంతో టాలీవుడ్ నాట మార్కెట్ కూడా బాగా పడిపోయింది. 'రోబో' తరువాత రజినీకాంత్ నుండి సరైన సినిమా రాకపోవడంతో అభిమానుల్లో ఉత్సాహం తగ్గిపోయింది.

గతేడాది విడుదలైన 'పేట' సినిమాని కూడా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ తో రజినీకాంత్ 'దర్బార్' సినిమా చేస్తే అనుకున్నంతగా బజ్ రావడం లేదు. ఈ సినిమా ట్రైలర్ లో రజినీకాంత్ మార్క్ మేనరిజమ్స్, స్టైల్, డైలాగ్స్ కనిపించాయే తప్ప కథ పరంగా కొత్తదనం ఏమీ కనిపించలేదు.

మహేష్ తో ఫైట్.. మరో పోస్టర్ తో షాకిచ్చిన బన్నీ?

జనాలను ఎగ్జైట్ చేసే విధంగా ట్రైలర్ లేదనే విషయం మాత్రం అర్ధమవుతోంది. రజినీకాంత్ సైతం 'దర్బార్' కథ మీద పెద్దగా ఆశలు పెట్టుకోవద్దనే సంకేతాలు ఇవ్వడం విశేషం. 'దర్బార్' తెలుగు వెర్షన్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. సినిమా కథ గురించి తెలిస్తే.. ఇలాంటి కథతో సినిమా ఎలా తీశారని అనిపిస్తుందని రజినీ వ్యాఖ్యానించడం గమనార్హం.

దీనికి కొనసాగింపుగా రజినీ మరో మాట కూడా చెప్పారు. కథ ఎలా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే తో మురుగదాస్ మ్యాజిక్ చేశాడని అన్నారు. అయితే ట్రైలర్, ఇతర ప్రోమోలు చూస్తే స్క్రీన్ ప్లే పరంగా కూడా ఏమీ కొత్తగా చేసినట్లు అనిపించలేదు. మరి ఈ నెల 9న స్క్రీన్ మీద రజినీని మురుగదాస్ ఎలా చూపించాడో చూడాలి!