కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు, సోషల్ డిస్టెన్సిన్గ్ అవసరాన్ని ప్రజలకు తెలియజేయడానికి నిన్న జనతా కర్ఫ్యూ పాటించమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇలా నరేంద్ర మోడీ  పిలుపును ఎందుకు అందరూ పాటించాలో... సాయంత్రం 5 గంటలకు చప్పట్లను ఎందుకు కొట్టమన్నారో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. 

ఏదైతేనేమి... దేశమంతా జనతా కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్. సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా బయటకు వచ్చి ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారందరికీ థాంక్స్ చెబుతున్నట్టుగా దేశమంతా సంఘీభావంగా తమ మద్దతును తెలిపారు కూడా. 

Also Read: నేనేమీ బాత్రూమ్ లో దాక్కోలేదు

ఇకపోతే.... ఈ జనతా కర్ఫ్యూ కి సంబంధించి కొన్ని ఫేక్ న్యూస్ ఇంటర్నెట్లో షికారు చేశాయి. కొన్ని న్యూస్ నవ్వు త్యేప్పిస్తే... కొన్నేమో చదువుకున్న వారిని కూడా బురిడీ కొట్టించేవిగా ఉన్నాయి. 

ఇలా బేసిక్ గా రెండు ఫేక్ న్యూస్ నిన్న ప్రచారంలో ఉన్నాయి. ఒకటేమొ ప్రభుత్వం విమానాల ద్వారా మందు చల్లుతుందనే ఒక వార్త కాగా రెండవది 14 గంటలు గనుక మనుషులు బయటకు రాకుండా ఉంటె కరోనా వైరస్ చైన్ ఆగిపోతుందని, కరోనా వైరస్ జీవితకాలం కేవలం 12 గంటలు కాబట్టే ప్రధాని 14 గంటల జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చారు అని ఆ ఫేక్ న్యూస్ సారాంశం. 

ఈ ఫేక్ న్యూస్ కి సెలెబ్రిటీలు సైతం బలయ్యారు. ఇలా కరోనా వైరస్ 12 గంటలు మాత్రమే బ్రతికుంటుందనే ఫేక్ న్యూస్ ను ఇద్దరు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లు నమ్మడం నిజంగా ఆశ్చర్యకరం. చెక్ చేయకుండా వారి వారి ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేయడం హాస్యాస్పదం. 

Also Read: సింగర్ కనికా కపూర్ కరోనా నిప్పు: దుష్యంత్ ఎవరెవరిని కలిశారంటే.....

ఆ ఇద్దరు సూపర్ స్టార్లు ఎవరో కాదు, ఒకరు తమిళ నటుడు రజినీకాంత్ కాగా... మరొకరు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇద్దరు కూడా ఇలా వైరస్ 12 గంటలు మాత్రమే బ్రతుకుతుందనే ఫేక్ న్యూస్ ని పోస్టు చేసారు. ట్విట్టర్ వీరిద్దరి పోస్టులను డిలేట్ కూడా చేసింది. 

ఒక్కసారిగా ట్విట్టర్ ఇలా చేయడంతో ఫేక్ న్యూస్ వల్ల కలిగే ప్రాబ్లం ఏమిటో ఈ ఇద్దరు నటులకు ఒకటే దెబ్బకు అర్థమయ్యేలా చేసి ఉంటుంది ట్విట్టర్. మామూలుగా వచ్చే ఫేక్ న్యూస్ నే ప్రజలు నమ్మేస్తూ ఉంటారు. ఇలా ఒకవేళ అదే ఫేక్ న్యూస్ ని గనుక ఇలాంటి సూపర్ స్టార్లు చెక్ చేయకుండా వాటికి ఎరలుగా మారితే... మరింత మంది సాధారణ ప్రజానీకం ఆ ఫేక్ న్యూస్ ని నమ్మే ప్రమాదముంది.