టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ గరుడవేగ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారని అనుకుంటే మళ్ళీ గతంలో మాదిరిగానే అపజయాలతో సతమతమవుతున్నారు. పైగా ఆయన వ్యక్తిగతంగా కూడా ఇటీవల పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. లైసెన్స్ రద్దవ్వడం అలాగే 'మా' అసోసియేషన్ లో విబేధాలు రావడంతో మొన్నటి వరకు ఆయనకు సంబందించిన రోజుకో వార్త మొన్నటి వరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఎట్టకేలకు రాజశేఖర్ మళ్ళీ తన సినీ లైఫ్ తో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొనడానికి కొత్త సినిమాకు సంబందించిన షెడ్యూల్స్ ని రెడీ చేసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా రాజశేఖర్.. డైరెక్టర్ వీరభధ్రమ్ తో ఒక సినిమా చేయాలనీ చర్చలు జరిపారు. రీసెంట్ గా కథను ఫైనల్ చేసిన రాజశేఖర్ వీలైనంత త్వరగా సినిమాను సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు.

అయితే గతంలో 'ఆహా నా పెళ్ళంట' - 'పూల రంగడు వంటి' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వీరభద్రం అనంతరం భాయ్ - చుట్టాలబ్బాయి సినిమాతో కోలుకోలేని డిజాస్టర్స్ ని ఎదుర్కొన్నాడు. ఇక రాజశేఖర్ కల్కి సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయారు. సో నెక్స్ట్ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని ఈ ఇద్దరు సాలిడ్ కథతో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరీ ఆ ప్రాజెక్ట్ తో ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.