లాల్ సలామ్ సినిమాకు రజనీ కెరీర్‌లోనే ఊహించని విధంగా దారుణమైన కలెక్షన్స్ నమోదు అయ్యాయి. రజనీ క్రేజ్‌కు సంబంధం లేకుండా అతి తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. 


గతేడాది ‘జైలర్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని మురిపించి.. మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కారు రజనీకాంత్‌ (Rajinikanth). ఇప్పుడీ జోష్‌లోనే ‘లాల్‌ సలాం’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన కుమార్తె ఐశ్వర్య ఈ మూవీకి దర్శకత్వం వహించడం విశేషం. విష్ణు విశాల్, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. పాటలు.. ట్రైలర్, టీజర్ లతో అందరి దృష్టినీ ఆకర్షించిన మొన్న శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో’... అంటూ ‘లాల్‌ సలాం’మన ముందుకు వచ్చింది. ఇలా మతసామరస్యాన్ని చాటి చెప్పే నేపథ్యంలో ఇప్పటి వరకు తెరపైకి ఎన్నో కథలొచ్చాయి. అయితే దీంట్లో ఆ పాయింట్‌ను క్రికెట్‌ను కేంద్రంగా చేసుకొని.. దానికి రాజకీయ ముసుగును తగిలించి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. 

రిలీజ్ కి ముందు భారీ బజ్ క్రియేట్ చేసుకున్న లాల్ సలామ్ సినిమా భారీ ఎక్సపెక్టేషన్స్ తో శుక్రవారం (ఫిబ్రవరి 9) నాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తమిళంలో ఈ సినిమాపై బజ్ భారీగానే ఉన్న తెలుగులో మాత్రం అంత రెస్పాన్స్ అయితే లేదు. ఫస్ట్ వీక్ అయ్యేసరికి భారీ డిజాస్టర్ గా నమోదు అయ్యి..దాదాపు బిజినెస్ క్లోజింగ్ కు వచ్చేసింది. తమిళనాడులో మొదటి వారం పూర్తయ్యేసరికి 16Cr గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగులో అయితే మరీ దారుణం కేవలం 1Cr మాత్రమే వసూలైంది. కేరళ నుంచి అయితే 65L, కర్ణాటక నుంచి 1.4 Cr, మిగతా ప్రాంతాలు అన్ని కలిపి 25L, మొత్తం దేశవ్యాప్తంగా గ్రాస్ 19.3 Cr, ఓవర్ సీస్ నుంచి 7.7 Cr, అన్ని కలిపి ప్రపంచ వ్యాప్తంగా 27 Cr వచ్చింది. అంటే టోటల్ షేర్ 12 Cr మాత్రమే. అంటే ఈ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అంచనా వేయచ్చు. 

లాల్ సలామ్ సినిమాకు రజనీ కెరీర్‌లోనే ఊహించని విధంగా దారుణమైన కలెక్షన్స్ నమోదు అయ్యాయి. రజనీ క్రేజ్‌కు సంబంధం లేకుండా అతి తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. 
ఈ క్రమంలో లాల్ సలామ్ మూవీని థియేటర్‌లో చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపట్లేదు.మరో ప్రక్క లాల్ సలామ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆసక్తిగా మారింది. లాల్ సలామ్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. భారీ ధరకు లాల్ సలామ్ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయిన 60 రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తుంది..కానీ ఇప్పుడు ఎగ్రిమెంట్ మార్చి నెలలోపలే తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తమిళ మీడియా అంటోంది.