సౌత్ లోనే కాకుండా దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో RRR ఒకటి. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ బగ్ బడ్జెట్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సినిమా మొదలైనప్పటి నుంచి అనేక రకాల రూమర్స్ వెలువడుతున్నాయి.  ప్రస్తుతం సినిమా క్లయిమాక్స్ కి సంబందించిన ఒక రూమర్ కూడా ఆడియెన్స్ లో అంచనాల డోస్ ని మరింత పెంచుతోంది.

సినిమాలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమరయోధుల చివరి ఫైట్ సీన్ దర్శకుడు రాజమౌళి భారీ యాక్షన్ ఎఫెక్ట్స్ తో చూపించబోతున్నాడట, ముఖ్యంగా వారిద్దరి పోరాటం అనంతరం డెత్ సీన్స్ కూడా ఆడియెన్స్ ని భావోద్వేగానికి లోను చేస్తాయట.  ఓ వైపు గర్వపడేలా ఆలోచనను కలిగిస్తూనే మరో వైపు సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయట.

చివరి అరగంట ఆడియెన్స్ రోమాలు నిక్కబొడిచేలా దర్శకుడు సీన్స్ ని డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి మొత్తంగా RRR ఆడియెన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. నెక్స్ట్ ఇయర్ జులై 30న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

సంగీత దర్శకుడు ఎమ్ఎమ్.కీరవాణి సినిమాకు సంగీతం సమకూరుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని ట్యూన్స్ చేసి రెడీగా ఉంచాడు. సినిమాలో టైటిల్ సాంగ్ కోసం ట్యూన్ కి దర్శకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో ఎక్కడా కూడా రొమాన్స్ డోస్ పెరగకుండా ఒక పాజిటివ్ వేలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ -రామ్ చరణ్ మధ్య కూడా ఒక స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.