టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ RRR కోసం అభిమానులు  ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పై కనిపించనున్నారు. దేశవ్యాప్తంగా సినిమాకు సంబందించిన అప్డేట్ కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.

రీసెంట్ గా రిలీజ్ చేసిన హాలీవుడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్స్ ఒక రేంజ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక న్యూ ఇయర్ సందర్బంగా దర్శకుడు రాజమౌళి మరో స్పెషల్ లుక్ ని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా - జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే వారికి సంబందించిన అసలైన RRR ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారా అనే సందేహం కలుగుతోంది.

రూమర్స్ ప్రకారం మెగా నందమూరి అభిమానులద్దరికి కిక్కిచ్చేలా ఆ లుక్ ఆకట్టుకుంటుందని టాక్. ఇక RRR సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. వచ్చే ఏడాది జులై 31న సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న RRR సినిమాను డివివి.దానయ్య 400కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.

హిట్టు కథలతో బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయిన తెలుగు దర్శకులు