ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర .. సినిమాలు, సమాజం గురించి కూడా స్పందిస్తూ ఉంటారు. ఈక్రమంలో అతను స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ఓ ట్వీట్ చేయగా.. దానికి జక్కన్న కూడా డిఫరెంట్ గా సమాధానం చెప్పారు.
అటు బిజినెస్ ఇటు.. సమాజసేవ.. కష్టాల్లో ఉన్నవారికి చేయూత.. సినిమాల గురించి ఫన్నీ కామెంట్స్.. ఆనంద్ మహేంద్ర తీరు అందరికంటే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ పై కూడా ఆయన ప్రశంసల వర్షంకురిపించాడు. రామ్ చరణ్ తో నాటు నాటు స్టెప్ కూడా వేశాడు.
ఇక ఇటు రాజమౌళి గురించి చెప్పేదేముంది.. బహుబలితో తెలుగు ఖ్యాతి దేశ వ్యాప్తం చేసి.. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తం అయ్యాడు జక్కన్న. బాలీవుడ్ ను పక్కన కూర్చోబెట్టి.. టాలీవుడ్ ను పరుగులు పెట్టించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ స్థియికి ఎదిగాడు. అవతార్ డైరెక్టర్ కూడా జక్కన్నతో తన సినిమా గురించి డిస్కర్షన్ చేశాడు అంటే.. రాజమౌళి గురించి ఇంత కంటే ఇంకా ఎం చెపుతాం.
ట్రిపుల్ ఆర్ తరువాత రాజమౌళి నెక్స్ట్ సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్వరలో మహేష్ బాబుతో రాజమౌళి భారీ అడ్వెంచర్ ప్లాన్ చేస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతోంది మూవీ. ఆ తర్వాత కూడా మహాభారతం తీస్తాడని అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఓ సినిమా గురించి రాజమౌళిని ఉద్దేశించి ట్వీట్ చేయగా రాజమౌళి రిప్లై ఇవ్వడం ఆసక్తి కరంగా మారింది.
ఆనంద్ మహీంద్రా సింధు నాగరికతను చూపించే హరప్పా, మొహంజొదారోకు సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేశారు. ఇవి మన చరిత్రను ఇంకా సజీవంగా చూపించి, వాటి గురించి మాట్లాడే పిక్చర్స్.. . మన ప్రాచీన నాగరికత గురించి చెప్తూ ఒక మంచి సినిమా తీసి ప్రపంచానికి చెప్పాలని రాజమౌళి గారిని కోరుతున్నాను అని మహేంద్ర ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ట్వీట్ కి రాజమౌళి వెంటనే స్పందించారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే.
రాజమౌళి స్పందిస్తూ.. అవును సర్, నేను గుజరాత్ లోని హరప్పా నాగరికత ఉన్న ఓ ఊరు ఉంది. అది ధోలావీర. అక్కడ మగధీర షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చాలా పురాతనమైన చెట్టుని చూశాను. అది శిలాజంగా మారిపోయి ఉంది. అప్పుడే ఈ చెట్టు ద్వారా సింధు నాగరికత ఎదుగుదల, పతనం గురించి చెప్పేలా ఒక సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత దాని కోసం రీసెర్చ్ చేస్తూ.. నేను కొన్నాళ్ళకు పాకిస్తాన్ కి వెళ్ళాను. ఆ కథ కోసం మొహంజొదారో దగ్గరకు వెళ్లాలని చాలా ప్రయత్నించాను. కానీ నాకు పాకిస్థాన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అని ఆన్సర్ ఇచ్చారు.
ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ కాన్వర్జేషన్ వైరల్ గా మారింది. అటు నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది అయితే ఆనంద్ మహేంద్ర చెప్పినట్టు ఆ సినిమాను ఎలాగైన చేసి చూపించండి అంటూ రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారు.
