టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా RRR కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా  చెప్పనవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల సగానికి పైగా షూటింగ్ ని ఫినిష్ చేసిన రాజమౌళి మిగిలిన వర్క్ లో కూడా స్పీడ్ పెంచుతున్నాడు. ఇకపోతే సినిమాకు సంబందించిన స్పెషల్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో తప్పకుండా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వస్తోంది. అయితే సినిమా రిలీజ్ కి ఇంకా 10నెలల సమయం ఉండడంతో రాజమౌళి అంత త్వరగా రిలీజ్ చేయడానే టాక్ కూడా వస్తోంది.

 

మరి రాజమౌళి ఈ విషయంలో షాక్ ఇస్తాడా ? లేక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి కిక్కిస్తాడా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల సీనియర్ హీరో RRR టీమ్ తో కలిశారు. ఒక ముఖ్యమైన అతిధి పాత్ర కోసం అజయ్ కొన్ని నిమిషాల పాటు బిగ్ స్క్రీన్ పై అలరించనున్నట్లు టాక్ వస్తోంది. సినిమాలో అజయ్ చేయబోయే పాత్ర చాలా పవర్ఫుల్ అని తెలుస్తోంది.