దర్శకధీరుడు రాజమౌళి తెరక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఇటీవలే టైటిల్ మోషన్ పోస్టర్, రాంచరణ్ ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ అంటే తెలుగులో ఫుల్ ఫామ్ రౌద్రం రుధిరం రణం అని, ఇంగ్లీష్ లో రైజ్ రివోల్ట్ రోర్ అని ప్రకటించారు. 

సమకాలీకులు అయిన అల్లూరి సీతా రామరాజు, కొమరం భీం అజ్ఞాతంలోకి వెళ్లిన టైంలో స్నేహితులుగా మారి ఉంటె ఎలా ఉంటుంది అనే ఆసక్తికర పాయింట్ తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. 

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. దీనితో రాజమౌళి ఇంట్లోనే ఉంటూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ తర్వాత ఈ చిత్రంలో అలియా భట్ పాత్రలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలియా భట్ ఈ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

రాంచరణ్ కి జోడిగా అలియానే ఎంచుకోవడానికి గల కారణాన్ని రాజమౌళి వివరించారు. ఎన్టీఆర్, చరణ్ లకు ధీటుగా నిలబడే నటి కోసం వెతికాం అని రాజమౌళి తెలిపారు. ఆ టైంలో అలియా భట్ ని కలవడం, ఆమెకు పాత్ర గురించి వివరించడం జరిగింది అని జక్కన్న తెలిపాడు. అమాయకంగా కనిపించాలి అదే సమయంలో అవసరమైతే తెగువ చూపాలి.. అలాంటి పాత్రకు అలియా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని రాజమౌళి అన్నారు. 

రాజమౌళి వ్యాఖ్యలని బట్టి అలియా పాత్ర ఈ చిత్రంలో ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోందో అర్థం అవుతోంది. ఈ చిత్రంలో కీరవాణి, సముద్ర ఖని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.