దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి భారీ విజయం తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ పై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి. దేశం మొత్తం ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

ఈ చిత్రాన్ని 2020 జులై 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. సాధారణంగా రాజమౌళి చిత్రాల చిత్రీకరణ ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ అంశంపై మత్తువదలరా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో జోకులు పేలాయి. ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి.. తన సినిమాపై తానే జోకులు వేసుకున్నారు. 

ప్రీరిలీజ్ ఈవెంట్ కు సుమ యాంకర్ గా వ్యవహరించారు. సుమ పదే ఆర్ఆర్ఆర్ రిలీజ్ గురించి ప్రస్తావించింది. దీనిపై రాజమౌళి తన ప్రసంగానికి ముందు జోకులు వేశారు. 2020లోనే వస్తుందా.. విడుదలవుతుందా అంటూ నా సినిమాపై పడొద్దు. వీళ్ళే మూడేళ్లు సినిమా చేశారట. అలాంటిది నేను మూడేళ్లు సినిమా చేస్తే తప్పా అని రాజమౌళి సరదాగా వ్యాఖ్యానించారు. 

పర్వాలేదు సర్.. మీ చిత్రంలో మూడు 'ఆర్' లు ఉన్నాయ్.. మూడేళ్లు సమయం తీసుకోవచ్చు అని చెప్పింది. దీనితో అక్కడ అందరు ముఖాల్లో నవ్వులు విరిశాయి.