రామ్ చరణ్ గత కొద్ది రోజులుగా తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ సంగతి ప్రక్కన పెట్టి నిర్మాతగా తన తొలి చిత్రం అయిన సైరా బిజీలో ఉన్నారు. ఈ చిత్రం రిలీజ్, ప్రమోషన్స్ అంటూ హడావిడిగా ఉంటున్నారు. ఈ హడావిడిలో తనను తాను సరిగ్గా పట్టించుకోవటం లేదట. తండ్రి సినిమాను సూపర్ హిట్ చేయాలనే తపనతో తిరుగుతున్నారు. రిలీజ్ కు ముందు ఓ రకమైన టెన్షన్..తర్వాత కలెక్షన్స్..ప్రమోషన్స్  ప్లానింగ్ వీటితో రాత్రంబవళ్లూ కష్టపడుతున్నారు. దాంతో రామ్ చరణ్ లో ఉండే గ్లో తగ్గిందట.

రీసెంట్ గా సైరా సినిమా చూసి మెచ్చుకున్న రాజమౌళి ..ఆ విషయాన్ని రామ్ చరణ్ కు చెప్పారట. నువ్వు వెంటనే షూటింగ్ కు రావాలి..అలాగే ఎక్కువ టెన్షన్ పెట్టుకుని ముఖంలో తేడా తెచ్చుకోనేలా ఉండవద్దు అని చెప్పారట. తన హీరో హెల్త్, లుక్ తనకు ముఖ్యం అని చెప్పారట. అలాగే రిలీజ్ అయ్యిపోయింది కాబట్టి మిగతా ఫార్మాలిటీస్ క్రింద వాళ్లకు అప్పచెప్పి నిర్మాతగా రిలీవ్ అయ్యి షూటింగ్ కు ప్రిపేర్ అవ్వమని చెప్పారట. ఇంక లేటు చేయటానికి వీళ్లేదని, హీరోలకు దెబ్బలతో ఇప్పటికే సినిమా లేటు మోడ్ లో వెళ్తోందని, ఇలా అయితే అనుకున్న తేదీకి రిలీజ్ కష్టమని చెప్పారట. దాంతో రామ్ చరణ్ కూడా సరే అని త్వరలోనే షూటింగ్ కు హాజరు అవుతానని హామీ ఇచ్చారట.  

ఇక ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కోసం చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది.  రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇంట్రస్టింగ్ గానే ఉంటోంది.   అలాగే... ఈ చిత్రానికి ‘రామ రౌద్ర రుషితం’ అనే  టైటిల్  బాగుంటుందని, దాన్నే ఖరారు చేద్దామని టీమ్ భావిస్తోందిట. మిగిలిన భాషల్లో  ‘రైజ్‌ రివోల్ట్‌ రివెంజ్‌’ పేరుతో విడుదల కానుందని తెలుస్తోంది.