ఇటీవల బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని లండన్ లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించారు. ఇది బాహుబలి చిత్రానికి దక్కిన మరో గౌరవం. రాయల్ అల్బర్ హాల్ లో జరిగిన బాహుబలి ప్రదర్శనకు రాజమౌళి తో పాటు ప్రభాస్, అనుష్క, రానా, కీరవాణి పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో రాజమౌళికి లండన్ లోని భారతీయుల నుంచి, మీడియా నుంచి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సంధర్భంగా రాజమౌళి అమరేంద్ర బాహుబలి పాత్రని శ్రీరాముడితో అద్భుతంగా పోల్చి తన వివరణ ఇచ్చాడు. అమరేంద్ర బాహుబలి పాత్రలో శ్రీరాముడి లక్షణాలు ఉంటాయని రాజమౌళి అన్నారు. 

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరినీ సినిమా పాత్రల పరంగా చూసుకుంటే.. శ్రీకృష్ణుడు మన కమర్షియల్ చిత్రాలకు పక్కాగా సరిపోయే పాత్ర. కానీ శ్రీరాముడి క్యారెక్టర్ మాత్రం బోరింగ్. ఓకే బ్యార్యతో ఉంటాడు.. తండ్రి మాట జవదాటడు.. ధర్మాన్ని పాటిస్తాడు.. సున్నిత మనస్కుడు. ఇవన్నీ మన కమర్షియల్ చిత్రాలకు సరిపోయే లక్షణాలు కావు. 

అదే శ్రీకృష్ణుడు పాత్ర అద్భుతంగా ఉంటుంది.. 20 వేల మంది గోపికలతో రొమాన్స్.. మాయ చేస్తాడు.. ఇలా శ్రీకృష్ణుడు పాత్ర చాలా గమ్మత్తుగా ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడి గుడి ఒకటి ఉంటే శ్రీరాముడికి మాత్రం 50 గుళ్ళు ఉంటాయి. రాముణ్ణి మనం అంతలా ఆరాధించడానికి కారణం ఉంది. 

వాల్మీకి మహర్షి గారు రామాయణం రాసినప్పుడు శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని సున్నితంగా చెబుతూనే రెండు మాస్ క్యారెక్టర్స్ గురించి కూడా అద్భుతంగా చెప్పారు. వాళ్లే లక్ష్మణుడు,అంజనేయుడు. ఆ రెండు పాత్రలు మోస్ట్ పవర్ ఫుల్. వాళ్ళిద్దరి శక్తి సామర్థ్యాలని మనం అంచనా వేయలేం. అలాంటి మాహా పరాక్రమవాంతులే రాముడు కోసం ప్రాణం ఇచ్చేస్తారు. 

ఈ అంశంలోనే మనం రాముడికి కనెక్ట్ అయిపోయాం అని రాజమౌళి అన్నారు. హనుమంతుడు, లక్ష్మణుడి లక్షణాలే మనకు కూడా వచ్చాయి. శ్రీకృష్ణుడిని ఎవరన్నా ఒక మాట అన్నా ఊరుకుంటాం ఏమో కానీ రాముణ్ణి మాత్రం దూషిస్తే మన రక్తం మరిగిపోతుంది. 

అదేవిధంగా అమరేంద్ర బాహుబలి పక్కన కట్టప్ప పాత్ర ఉండడం వల్ల.. ఆ క్యారెక్టర్ కు అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు అని రాజమౌళి వివరణ ఇచ్చాడు.