సెలబ్రెటీ చెయ్యేస్తే ఆ సినిమా సేల్ అయిపోతుంది కదరా అంటూంటారు ఇండస్ట్రీ జనం. ముఖ్యంగా స్టార్ డైరక్టర్ రాజమౌళి వంటి వారు  మెచ్చుకుంటూ ఓ మాట చెప్తే తమ సినిమాకు పబ్లిసిటీ వస్తుందని మురిసిపోతారు. ఎందుకంటే ఆయనకు ఉన్న పాపులారిటీతో ఆ సినిమా జనాల్లో నానేలా చేస్తుంది.

చిన్న సినిమాల పబ్లిసిటీకు అది బాగా ప్లస్ అవుతుంది. తాజాగా రాజమౌళి  సినిమా దర్శకుడుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న కమిడియన్ శ్రీనివాస రెడ్డికి విషెష్  తెలియచేస్తూ.. ఆ సినిమా ట్రైలర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.

వైట్ డ్రెస్ లో అనసూయ పిచ్చెక్కించే ఫోజులు.. వైరల్ అవుతున్న ఫొటోస్!

పాపులర్ కమెడియన్, హీరో,క్యారక్టర్ ఆర్టిస్ట్ ..ఇలా అనేక విధాలుగా తన ప్రతిభా ప్రదర్శన చేస్తున్న శ్రీనివాస రెడ్డి దర్శక, నిర్మాతగా మారి ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’.. (మంచి రసగుల్లా లాంటి సినిమా) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్ గా మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపధ్యంలో దర్శకుధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి  శ్రీనివాస రెడ్డికి శుభాకాంక్షలు తెలియచేశారు..

‘‘నేను కెరీర్‌ స్టార్ట్ చేసిన‌ప్పటి నుండి శ్రీనివాస‌రెడ్డి నాకు తెలుసు. త‌ను మంచి క‌మెడియ‌న్‌. తొలిసారి ‘భాగ్యన‌గ‌ర వీధుల్లో గ‌మ్మత్తు’ సినిమాతో ద‌ర్శక, నిర్మాత‌గా ప‌రిచయం అవుతున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస‌రెడ్డి అభినంద‌న‌లు తెలుపుతున్నాను’’ అంటూ రాజమౌళి ట్వీట్ చేస్తూ ట్రైలర్ షేర్ చేశారు. ఈ ట్వీట్ ఖచ్చితంగా శ్రీనివాస రెడ్డి సినిమాకు ప్లస్ అవుతుందనటంలో సందేహం ఏ మాత్రం లేదు.
 
ఈ చిత్రంలో శ్రీనివాస రెడ్డితో పాటు సత్య, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించగా, వెన్నెల కిశోర్, చిత్రం శ్రీను, రఘబాబు, సత్యం రాజేష్, సుమన్ శెట్టి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క జరుగుతోంది.. డిసెంబర్ 6న ‘‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’’ రిలీజ్ కానుంది. సినిమాటోగ్రఫీ : భరణి కె ధరన్, ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్, మ్యూజిక్ : సాకేత్ కోమండూరి, ఆర్ట్ : రఘు కులకర్ణి, లైన్ ప్రొడ్యూసర్ : చిత్రం శ్రీను, నిర్మాత, దర్శకత్వం : వై.శ్రీనివాస రెడ్డి