ఉయ్యాలా జంపాల సినిమాతో కథానాయకుడిగా టాలీవడ్ కి పరిచయమైన కుర్ర హీరో రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో వరుసగా సక్సెస్ లు అందుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం ఎలాంటి అపజయాలు ఎదుర్కుంటున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాయి. మొన్న క్రిస్మస్ కానుకగా వచ్చిన ఇద్దరి లోకం ఒక్కటే సినిమా హిట్టవుతుందని భావించాడు.

ఆ సినిమా కూడా గట్టెక్కించలేకపోయింది. దీంతో సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మళ్ళీ తన మార్కెట్ ని పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. గుండెజారి గల్లంతయ్యిందే దర్శకుడు విక్రమ్ కుమార్ కొండా బెంగాల్ టైగర్ నిర్మాత కెఎస్.రాధామోహన్ ఈ హీరోతో ఒక ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తయ్యింది.

ఇకపోతే సినిమాకు "ఒరేయ్ బుజ్జిగా" అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లలో కనిపిస్తాడని టాక్. ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులని వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. కుదిరితే ఏప్రిల్ 3న సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలనీ నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. వరుస అపజయాలతో డీలా పడ్డ రాజ్ తరుణ్ కి ఈ చిత్రం ఎంతవరకు బూస్ట్ ఇస్తుందో చూడాలి.