వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ కుర్ర హీరో రాజ్ తరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకొని నటిస్తోన్న చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. ఆడు మగాడ్రా బుజ్జి ఫేం జీఆర్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ ఫుల్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌కు జోడిగా అర్జున్‌ రెడ్డి ఫేం షాలిని పాండే నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సినిమా టీజర్ ని పాటలను విడుదల చేసింది.

వరుస ఫ్లాప్ లు.. ఛాన్స్ లు మాత్రం తగ్గడం లేదు!

తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది. ఇద్దరి మధ్య నడిచే క్యూట్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందించారు. ''ఒక మనిషి కావాలి అనుకోవడానికి.. బయటకి కనిపించే ఒక్క ఫీలింగ్ సరిపోతుంది.. కానీ వొద్దు అనుకోవడానికి బయటకి కనిపించని వంద కారణాలు కావాలి'' అనే డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది.

మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాలో నాజర్, మాస్టర్ భరత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాతోనైనా రాజ్ తరుణ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి!