సెన్సార్ వారి నియమ నిబంధనలు చాలా చిత్రంగా ఉంటాయి. సినిమాకు సెన్సార్ చేసి సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అయితే అదే సమయంలో వారి రూల్స్ కూడా ఆశ్చర్యం అనిపిస్తాయి. తాజాగా దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన  ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా పూర్తైంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే సినిమా పూర్తి గా ఫ్యామిలీలతో వచ్చే చూసేలా క్లీన్ గా ఉందిట. కాకపోతే సినిమాలో సందర్బానుసారం ఒకే ఒక లిప్ లాక్ ఉందిట. అది తీసేస్తే ..క్లీన్ యు సర్టిఫికేట్ ఇద్దురట. అంటే కేవలం లిప్ లాక్ వల్ల...సెన్సార్ లుక్ మారిపోయిందన్నమాట.

ఇక సెన్సార్ వారు ఈ సినిమా చూసి మంచి ఫీల్ గుడ్ మూవి అని మెచ్చుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్ లో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉండటంతో బాగా కనెక్ట్ అయ్యారని తెలుస్తోంది. థియోటర్ లో కూడా అదే స్దాయి రెస్పాన్స్ వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. అదే కనుక జరిగిదే సినిమా మంచి హిట్టే అవుతుందని ట్రేడ్ లో వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో షాలినీపాండే అదరకొట్టిందని, నటన అద్బుతంగా ఉందని టాక్. రాజ్ తరణ్ కు అయితే రీలాంచ్ సినిమా లాంటిదిట. అందుకే దిల్ రాజు అడగగానే వేరే ఆలోచన లేకుండా ఓకే చేసారట.

యంగ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా  షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దమైంది.  ఈ డిసెంబర్ నెలలోనే ఉండబోతోంది. తన బ్యానర్ లో ఓ హిట్ సినిమా రాబోతోందని దిల్ రాజు ఆనందంగా ఉన్నారట. రీసెంట్ గా ఆయన సినిమా చూసారట.

ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘రాజ్‌తరుణ్‌తో మా బ్యానర్‌లో చేస్తోన్న రెండో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. యువత, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంతో జి.ఆర్‌. కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మిక్కీ జె.మేయర్‌ సంగీతం, సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ వివరాలు తెలియచేస్తాం’’ అన్నారు.