దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీకి వచ్చాడు రాజ్ తరుణ్. కానీ అతడికి హీరోగా అవకాశాలు రావడంతో ఆ వైపు టర్న్ తీసుకున్నాడు. ' 'ఉయ్యాల జంపాల' సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూ.. హీరో పాత్రకు ఇంకెవ్వరూ సెట్ కాకపోవడంతో తనే హీరోగా మారాడు.

ఆ సినిమా హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్ కి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత నటించిన 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21 ఎఫ్' సినిమాలు సక్సెస్ అందుకోవడంతో హీరోగా నిలబడ్డాడు. నిర్మాతలు అతడితో సినిమాలు చేయడానికి ముందుకొచ్చారు. ఒక్కో సినిమాకి కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ కూడా తీసుకున్నాడు.

బికినీ వేసుకొని హాట్ షో చేస్తోన్న రాజశేఖర్ కూతుళ్లు!

కానీ తనకొచ్చిన విజయాలను నిలబెట్టుకోలేకపోయాడు. వరుస అవకాశాలు రావడంతో అందులో సరైన కథలను ఎన్నుకోలేక కొన్ని తప్పులు చేశాడు. ఫలితంగా రెండేళ్ల కాలంలో అరడజనుకి పైగా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. అతడి మార్కెట్ దారుణంగా పడిపోయింది.

కెరీర్ ప్రమాదకర స్థాయికి చేరుకున్న సమయంలో దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతతో సినిమా సెట్ కావడంతో రాజ్ తరుణ్ కి బ్రేక్ వస్తుందని అనుకున్నారు. కానీ ఆయన బ్యానర్ లో చేసిన 'లవర్' సినిమా డిజాస్టర్ అయింది. దీంతో అతడి కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. రాజ్ తరుణ్ ని ఆదుకోవడానికి మరోసారి దిల్ రాజు ముందుకొచ్చాడు.

వీరి కలయికలో 'ఇద్దరి లోకం ఒకటే' అనే సినిమా వచ్చింది. ఈ సినిమా స్పెషల్ గా ఉంటుందేమో అనుకున్నారు కానీ సినిమాలో విషయం లేదని తొలిరోజే తేల్చేశారు ప్రేక్షకులు. ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రాకపోవడంతో డిజాస్టర్ గా తేలిపోయింది. దిల్ రాజు నిర్మాతే రాజ్ తరుణ్ ని రక్షించలేకపోయాడు. ఇక అతడితో సినిమాలు తీయడానికి ఏ నిర్మాతలు ముందుకొస్తారో చూడాలి!