సెట్స్ పై హీరోలు రకరకాల డిమాండ్స్ చేస్తూంటారు. స్క్రిప్టులో మార్పులు చెప్తూంటారు. సీన్ ఇంప్రవైజేషన్ అంటారు. తను బాడీ చూపించే సీన్స్ డిజైన్ చేయమంటారు. కానీ లిప్ లాక్ ని డిమాండ్ చేసి, సినిమాలో పెట్టించుకునే వాళ్లు ఉంటారా..అంటే ఉన్నారనే వినపడుతోంది. ఆ హీరో మరెవరో కాదు రాజ్ తరణ్ అంటున్నారు. మొదట డైరక్టర్ విభేధించినా , ఆ తర్వాత ఓకే చేసాడని అంటున్నారు.

ఇప్పుడు వస్తున్న సినిమాల్లో లిప్ లాక్ కిస్ లు ఉంటే యూత్ కు కనెక్ట్ అవుతుంది అనుకున్నాడో లేక, తను పర్శనల్ గా కోరుకున్నాడో కానీ రాజ్ తరణ్ ..లిప్ లాక్ కోసం పట్టుబడ్డి మరీ తన సినిమాలో పెట్టించుకున్నాడనే వార్త మీడియా వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. తన తాజా చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’  సినిమా కథ ప్యూర్ లవ్ స్టోరీ అని, అందులో లిప్ లాక్ కిస్ లు పెట్టుకునేటంత హాట్ కంటెంట్ లేదని, కానీ హీరో పట్టుబట్టడంతో సినిమాలో పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే దిల్ రాజు వంటి నిర్మాత దగ్గర ఇలాంటి డిమాండ్స్  కుదురుతాయా...అనేదే ఇక్కడ ఈ వార్తని నమ్మాలా వద్దా అనే డైలమోలో పడేస్తున్న అంశం. కథ ప్రకారం లేకపోతే ఆయన సినిమాల్లో అలాంటివి ఎంకరేజ్ చేయటానికి ఇష్టపడరు  దిల్ రాజు అనేది ఆయన గత సినిమాలు చూస్తే అర్దమయ్యే అంశం.  

చిత్రం విషయానికి వస్తే..యంగ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా  షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్దమైంది.  ఈ డిసెంబర్ నెలలోనే ఉండబోతోంది. తన బ్యానర్ లో ఓ హిట్ సినిమా రాబోతోందని దిల్ రాజు ఆనందంగా ఉన్నారట. రీసెంట్ గా ఆయన సినిమా చూసారట.

ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘రాజ్‌తరుణ్‌తో మా బ్యానర్‌లో చేస్తోన్న రెండో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. యువత, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంతో జి.ఆర్‌. కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మిక్కీ జె.మేయర్‌ సంగీతం, సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ వివరాలు తెలియచేస్తాం’’ అన్నారు.