టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నా యువ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. కెరీర్ మొదట్లో హ్యాట్రిక్ విజయాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన ఈ యంగ్ యాక్టర్ గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అయితే నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని రాజ్ తరుణ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు.

దిల్ రాజుఁ ప్రొడక్షన్ లో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా చేసిన రాజ్ తరుణ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా హిట్టయితేనే నెక్స్ట్ సినిమాల బిజినెస్ బెటర్ గా ఉంటుంది. గత ఏడాది మూడు రాజ్ మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. రంగుల రాట్నం - రాజుగాడు - లవర్ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. 2017లో విడుదలైన 3 సినిమాలు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు.

 దీంతో రాజ్ తరుణ్ కెరీర్ చాలా తక్కువ సమయంలో ఇరకాటంలో పడింది. తొందరపాటుతో వెంటవెంటనే కథలను ఒప్పుకోవడంతో రాజ్ తరుణ్ వరుస అపజయాలని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇకపోతే నెక్స్ట్ ఈ హీరో నుంచి రాబోతున్న ఇద్దరి లోకం ఒక్కటే సినిమా డిసెంబర్ 25న రాబోతోంది. షాలిని పాండే సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

అయితే దాదాపు అదే సమయంలో రూలర్ - ప్రతిరోజు పండగే వంటి సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలు 5రోజుల వ్యవధిలో రిలీజ్ అవుతుండడం సాహసమనే చెప్పాలి. మరి రాజ్ తరుణ్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి. జిఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.