బిగ్ బాస్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. గత ఏడాది బిగ్ బాస్ 3 విజేతగా నిలిచిన రాహుల్ క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాహుల్ నిత్యం ఏదోఒక మ్యూజిక్ వీడియో చేస్తుంటాడు. తెలంగాణ యాసలో పాటలు పాడడంలో రాహుల్ దిట్ట. 

హుషారెత్తించే పాటలు పడుతూ రాహుల్ యువతలో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా దేశం మొత్తం విపత్కర పరిస్థితులని ఎదుర్కొంటోంది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన పెంచుతూ, ప్రభుత్వాలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. 

 

పలువురు సెలెబ్రిటీలు ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు. అందులో రాహుల్ కూడా భాగమయ్యాడు. ఇప్పటికే పలువురు రచయితలు, గాయకులు కరోనా పాటలతో ముందుకు వచ్చారు. రాహుల్ తాజాగా కరోనాపై రోమాలు నిక్కబొడుచుకునేలా పాటని పాడాడు. 

తెలంగాణ నేలమీద వేసేయ్ ఒట్టు.. కరోనాని తరిమి కొట్టు అంటూ సాగే ఈ పాట హుషారెత్తించే విధంగా ఉంది. ఈ పాటని మంత్రి కేటీఆర్ విడుదల చేయడం విశేషం. దీనితో రాహుల్ కేటీఆర్ తో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రాహుల్ పాడిన కరోనా సాంగ్ ని మీరూ వినండి..