బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో పెరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మనోడి పాటలు కూడా ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవకాశాలు కూడా ఎక్కువగానే అందుకుంటున్నాడు. తన ప్రయివేట్ ఆల్బమ్స్ లో డ్యాన్సులు చేసి యాక్టింగ్ స్కిల్ ని కూడా బయటపెట్టిన రాహుల్ యాక్టర్ గా కూడా బిజీ అయ్యేలా కనిపిస్తున్నాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. కృష్ణవంశీ  దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో రాహుల్ కూడా నటించబోతున్నాడట. ఇటీవల దర్శకుడు ఒక మాస్ రోల్ కోసం రాహుల్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. క్యారెక్టర్ గురించి చెప్పగానే రాహుల్ ఎలాంటి సందేహం లేకుండా సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరేవేగంగా సాగవుతున్నాయి.

మరాఠీలో హిట్టయిన నట సామ్రాట్ అనే కథకు ఈ సినిమా రీమేక్ గా  తెరకెక్కుతోంది. ప్రధాన పాత్రలో ప్రకాష్ రాజ్ - రమ్యకృష్ణ నటిస్తుండగా ఇప్పుడు మరో ముఖ్య పాత్ర కోసం రాహుల్ సిప్లిగంజ్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తన పాటలతో ఎంతో మంది అభిమానులను గెల్చుకున్న రాహుల్ బిగ్ బాస్ అనంతరం మరింత క్రేజ్ అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు యాక్టర్ గా కూడా బిగ్ స్క్రీన్ పై కనిపిస్తుండడంతో మనోడు హీరోగా ట్రై చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట.