బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కి ఎంత క్రేజ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షోలో ఉన్నన్ని రోజు రాహుల్, పునర్నవిల మధ్య ట్రాక్ బాగా పండింది. నిజానికి ఇద్దరూ స్నేహితులే అయినప్పటికీ లవర్స్ మాదిరి ప్రొజెక్ట్ చేసి హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చేలా చేశారు.

పునర్నవి, రాహుల్ లు కూడా లవ్, డేటింగ్ అంటూ షోని రక్తికట్టించారు. షో పూర్తయిన తరువాత రాహుల్ తల్లితండ్రులు ఇద్దరికీ ఇష్టమైతే పెళ్లి చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

ఈ సంగతి పక్కన పెడితే.. శుక్రవారం నాడు ప్రేమికుల రోజు కావడంతో పునర్నవి, రాహుల్ కలిశారు. ఇద్దరూ కలిసి హీరో వరుణ్ సందేశ్ ఇంటికి వెళ్లారు. వరుణ్, వితికా, రాహుల్, పునర్నవి కలిసి సమయం గడిపారు.

ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోకి 'హ్యాపీ వాలైంటైన్స్ డే ఫ్రమ్ ది గ్యాంగ్' అని క్యాప్షన్ ఇచ్చారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#happyvalentinesday from d gang!!! #pvvr #smiles #livelaughlove PC: @sabrish_51988

A post shared by Varun Sandesh (@itsvarunsandesh) on Feb 14, 2020 at 4:25am PST

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

With the #gang #pvvr 😍

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on Feb 15, 2020 at 2:26am PST