రాఘవేంద్ర రావు చిత్రాల్లో కొన్ని సిగ్నేచర్ మార్క్స్ కనిపిస్తారు. హీరోయిన్లని ఆయన చూపించినంత అందంగా మరే దర్శకుడు చూపించలేడంటే అతిశయోక్తి కాదు. రాఘవేంద్ర రావు చిత్రాల్లోని పాటల్లో పూలు, పళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. రాఘవేంద్ర రావు ఇటీవల ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు అలీతో పలు విషయాలు పంచుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ కు దర్శకుడిగా పనిచేయడంతో తన జీవితమే మారిపోయిందని రాఘవేంద్ర రావు అన్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన అడవి రాముడు చిత్రం అప్పట్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్. ఎన్టీఆర్ తో మొత్తం 12 చిత్రాలు చేశా. మెగాస్టార్ చిరంజీవితో 13 చిత్రాలు చేశానని రాఘవేంద్ర రావు చెప్పుకొచ్చారు. 

ఇక తనపై వచ్చిన విమర్శలకు సైతం రాఘవేంద్రరావు స్పందించారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఝుమ్మందినాదం' చిత్రతో తాప్సి హీరోయిన్ గా పరిచయమైంది. ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూలో తాప్సి రాఘవేంద్రరావుపై సెటైర్లు వేసింది. 

ఈ విషయాన్ని అలీ రాఘవేంద్రరావుతో ప్రస్తావించారు. మీరు పరిచయం చేసిన ఓ హీరోయినే బాలీవుడ్ కు వెళ్లి మీరు గురించి వ్యగ్యంగా మాట్లాడింది. హీరోయిన్లపై ఆయన పూలు, పళ్ళు ప్రయోగిస్తారని కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ మీకు తెలుసా అని అలీ రాఘవేంద్ర రావుని ప్రశ్నించారు. తెలియడమే కాదు.. ఆ ఇంటర్వ్యూ కూడా నేను చూశాను.

కానీ ఆ తర్వాత తాప్సినే తనకు సారీ చెప్పిందని రాఘవేంద్ర రావు అన్నారు. ఆ ఇంటర్వ్యూలో వారిని ఎంటర్టైన్ చేయడం కోసమే అలా మాట్లాడానని తనకు తాప్సి తెలిపిందని అన్నారు. నేను ఇలాంటి విమర్శలని పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళతాను అని రాఘవేంద్రరావు అన్నారు.