టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి అవకాశాలను అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశి ఖన్నా. మిగతా హీరోయిన్స్ సంగతి ఎలా ఉన్నా కూడా రాశి మాత్రం మినిమమ్ గ్యారెంటీ హిట్స్ తో ఏడాదికి ఆరు సినిమాలు చేస్తోంది. ఏడాదికి ఒక్క హిట్టు దక్కినా ఇండస్ట్రీని స్ట్రాంగ్ గా ఆకర్షిస్తోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ తో బ్యూటీ బిజీగా మారింది. ప్రతిరోజు పండగే సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమ్మడు హైదరాబద్ లోని గోకుల్ థియేటర్ వద్ద టికెట్లు అమ్మింది. బాక్స్ ఆఫీస్ కౌంటర్ వద్ద కూర్చొని వచ్చిన ప్రేక్షకులను పలకరిస్తూ ప్రతి రోజు పండగే టికెట్లను బుక్ చేసి ఇచ్చింది.

అందుకు సంబందించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల వెంకిమామ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశిఖన్నా వారం గడవకముందే మరో సినిమాతో బిగ్ స్క్రీన్ పై కనిపించబోతోంది. సాయి ధరమ్ తేజ్ తో అమ్మడికి ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీరు చేసిన సుప్రీమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరొక సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

2020 బిగ్ మూవీస్.. టాలీవుడ్ @2వేల కోట్లు(+)