ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్ గా రాశి ఖన్నా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత తక్కువ టైంలోనే రాశి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. చివరగా రాశి ఖన్నా ప్రతి రోజూ పండగే, వెంకీ మామ, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాల్లో నటించింది. 

తాజా సమాచారం మేరకు రాశి ఖాన్ ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. సింగం కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. దర్శకుడు హరి, క్రేజీ హీరో సూర్య మరోసారి చేతులు కలపబోతున్నారు. కానీ ఈ సారి సింగం సిరీస్ కోసం కాదు. 

చిలకపచ్చ చీరలో నడుము అందాలు.. తప్పకుండా చూడాల్సిన హాట్ ఫోటోస్

వీరిద్దరి కాంబోలో అరువా అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రాశి ఖన్నా ఎంపికైంది. ఈ విషయాన్ని రాశి ఖన్నా స్వయంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తుండగా రివీల్ చేసింది. 

తమిళంలో కూడా రాణించేందుకు రాశి ఖన్నాకు ఇది చక్కటి అవకాశం. దర్శకుడు హరి చిత్రాలు మాస్ ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉంటాయి. అలాగే ఆయన చిత్రాల్లో హీరోయిన్ల పాత్రలకు సైతం ప్రాధాన్యత ఉంటుంది.