Asianet News TeluguAsianet News Telugu

హాట్ టాపిక్ గా రాధిక ఆస్ది, ఆప్పులు లెక్కలు.. అఫీషియల్‌గా ఎంత ప్రకటించిందంటే?

రాధిక ప్రస్తుతంరాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. 

Raadhika declared the total value of her assets as Rs.53.45 crores jsp
Author
First Published Mar 27, 2024, 7:34 AM IST

నటిగా పాపులర్ అయ్యిన రాధిక రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉంటోంది. అయితే తొలిసారిగా ఆమె నామినేషన్ వేసి ఎలక్షన్స్ లో పోటీకి దిగుతోంది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. తమిళనాడుతో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటిస్తున్నారు.

అలా తమిళనాడులోని విరుదునగర్‌ నుంచి బరిలోకి దిగుతున్న నటి రాధికా శరత్‌ కుమార్‌  నామినేషన్‌ దాఖలు చేశారు. ఈమె బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో దాఖలు చేసిన నామినేషన్‌లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఆ లెక్కలు చూస్తే..

Raadhika declared the total value of her assets as Rs.53.45 crores jsp

వీటి ప్రకారం రాధిక తన మొత్తం ఆస్తుల విలువలను రూ. 53.45 కోట్లుగా ప్రకటించారు. వీటిలో రూ.33.01లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి రూ.27.05కోట్ల చరాస్తులున్నట్లు తెలిపారు. ఇక తనకు రూ. 26.40 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని ఆమె ప్రకటించారు. అలాగే రాధికకు రూ. 14.79 కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే రాధిక ప్రస్తుతంరాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. కాగా రాధిక భర్త హీరో శరత్‌ కుమార్‌ తన ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి పార్టీని బీజేపీలో విలీనం చేసిన నేపథ్‌యంలో రాధికకు విరుదునగర్‌ సీటను ఇచ్చారు. రాధిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

Follow Us:
Download App:
  • android
  • ios