మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్ కు స్వస్తి చెప్పి తిరిగి సినిమాల్లో దూసుకు పోతున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాలు చేయలేదు. రాజకీయాల్లో చిరంజీవి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సినిమాలు వదిలిపెట్టి రాజకీయాల్లోకి చిరంజీవి వెళ్లడంపై సీనియర్ నటి రాధిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

చిరంజీవి గారు నటుడిగా ఉన్న స్థాయికి.. ఆయన రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం నిజంగా బోల్డ్ స్టెప్. అది చాలా సాహసోపేతమైన నిర్ణయం. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లే సమయంలో నేను ఆయనకు ఫోన్ చేశా. మీరు కింగ్.. దయచేసి సినిమాలు మానేయొద్దు అని తరచుగా చెబుతూ ఉండేదాన్ని.

'ఏరా నాకు రెమ్యునరేషన్ ఇస్తావా'.. చిరుపై షాకింగ్ కామెంట్స్, లైవ్ లో ఏడ్చేసిన రాధిక భర్త

ఆయన చూద్దాం అంటూ సమాధానం ఇచ్చేవారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాక ఏం జరిగిందనేది అనవసరం. కానీ చిరంజీవి లాంటి వ్యక్తి ఆ డెసిషన్ తీసుకోవాలంటే చాలా గట్స్ కావాలి అని రాధిక అన్నారు. ఏది ఏమైనా ఆయన తిరిగి సినిమాలు చేస్తుండడం సంతోషం అని రాధిక చెప్పుకొచ్చింది. 

80వ దశకంలో రాధిక, చిరంజీవి సూపర్ హిట్ జోడి. వీరిద్దరి కాంబోలో అభిలాష, దొంగమొగుడు లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి.